Reading Time: < 1 minute
Tharun Bhascker Eesha Rebba At Virosh Wedding Udaipur

ViRash Wedding: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వేడుకల సందడి మొదలైపోయింది. అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘విరోష్’ వివాహం రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో అట్టహాసంగా జరుగుతోంది. ఉదయపూర్‌లోని ప్రఖ్యాత ITC మెమెంటోస్ రిసార్ట్, సరస్సుల మధ్య ఉన్న ఈ రాజభవనంలో వేడుకలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 26న విజయ్ – రష్మికల వివాహం జరగనుంది. నిజానికి ఈ పెళ్లి చాలా తక్కువ మంది అతిథులకు ఆహ్వానం అందింది, అలాగే అత్యంత గోప్యంగా జరుగుతోంది. వేదిక వద్ద ఫోన్లు, కెమెరాలను అనుమతించడం లేదు. ఈ స్టార్ కపుల్ వివాహ వేడుకలు ఫిబ్రవరి 24 మెహందీ వేడుకతో సెలబ్రేషన్స్ మొదలయ్యాయి.

READ ALSO: Pradeep Ranganathan: చేతిలో 8 సినిమాలు.. ₹25 కోట్ల రెమ్యునరేషన్! అయినా డేట్ల కోసం నిర్మాతల క్యూ

ఫిబ్రవరి 25: హల్దీ, సంగీత్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. అతిథుల కోసం దక్షిణ భారత వంటకాలతో పాటు జపనీస్ థీమ్ డిన్నర్, పూల్‌సైడ్ వాలీబాల్ వంటి వినూత్న ఏర్పాట్లు చేశారు. ఈ పెళ్లి వేడుకల కోసం ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు ఉదయపూర్ చేరుకుంటున్నారు. దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి ఈశా రెబ్బా జంటగా ఉదయపూర్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో ఈ పెళ్లి వార్తలకు మరింత బలం చేకూరింది. వీరు విజయ్‌కు అత్యంత సన్నిహితులు అన్న సంగతి తెలిసిందే. ఉదయపూర్‌లో కేవలం కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకున్న తర్వాత, సినీ ప్రముఖులు, అభిమానుల కోసం మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో భారీ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నో ఏళ్ల రూమర్లకు తెర దించుతూ, ఈ ‘హిట్’ జోడీ ఇప్పుడు నిజ జీవితంలోనూ ఒకటి కాబోతోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం #ViRash హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.

READ ALSO: CM Chandrababu: ప్రమాదకర రసాయనాలతో కల్తీ నెయ్యి తయారు..