Reading Time: < 1 minute
Cm Chandrababu Dangerous Chemicals Adulterated Ghee

CM Chandrababu: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై శాసనసభ చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రమాదకర రసాయనాలతో కల్తీ నెయ్యి తయారు చేశారని చంద్రబాబు ఆరోపించారు. దేవుడి కోసం తక్కువ ధరకే ఇస్తున్నారంటే ఆలోచించుకోవాలి అని సూచించారు. అవినీతి గానీ, కుట్ర పూరిత ఆలోచన దీని వెనుక ఉంటుందని చెప్పుకొచ్చారు. కెమికల్స్తో నెయ్యి తయారీ చేసి ఇంకా బుకాయిస్తున్నారు అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: CM Chandrababu: ఇద్దరు టీటీడీ చైర్మన్లు కల్తీ జరిగిందని ఒప్పుకున్నారు..

అయితే, గత పాలనలో విధ్వంసకర పరిస్థితులు చూశామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నేను సీఎం అయ్యాక మొదట ప్రిన్సిపల్‌ సెక్రటరీ కోసం మొదటి సంతకం చేశా.. టీటీడీ ప్రక్షాళన కోసం ఈవోను నామినేట్‌ చేశాను.. నాకు ఏ కష్టమొచ్చినా వెంకన్న స్వామికే చెప్పుకుంటాను అన్నారు. ఒక లడ్డూ విషయంలోనే కాదు.. అనేక విషయాల్లో గత ప్రభుత్వం తప్పు చేసింది.. కుట్ర కోణాన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి.. ల్యాబ్‌లకు కన్ను కప్పి టెండర్లు దక్కించుకున్నారు.. 23.01.2026న సీబీఐ ఛార్జిషీట్‌ వేసింది.. రాజకీయ వివాదం ఉండకూడదని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులతో సిట్‌ ఏర్పాటు చేశామని చంద్రబాబు నాయుడు అన్నారు.