Reading Time: < 1 minute
Ind Vs Zim Is Sanju Samson Indias Solution To Top Order Spin Trouble In T20 World Cup 2026

Sanju Samson Likely To Play IND vs ZIM Super 8 Match: టీ20 ప్రపంచకప్‌ 2026లో టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటింగ్‌పై చర్చలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఓపెనింగ్‌లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లపై ప్రత్యర్థి జట్లు స్పిన్‌తో దాడి చేయడం విజయవంతంగా మారుతోంది. గత మూడు మ్యాచ్‌ల్లో భారత్ తొలి ఓవర్‌లోనే స్పిన్ బౌలింగ్‌లో వికెట్ కోల్పోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. మొదటి ఓవర్‌లో స్పిన్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మ మూడుసార్లు, ఇషాన్ కిషన్ ఒకసారి డక్ అవుట్ కావడం విశేషం.

సూపర్-8లో టీమిండియాపై జింబాబ్వే కూడా మొదటి ఓవర్‌లో స్పిన్ వ్యూహాన్ని కొనసాగించే అవకాశముంది. కెప్టెన్ సికందర్ రాజా లేదా యువ స్పిన్నర్ బ్రియాన్ బెన్నెట్ కొత్త బంతితో బౌలింగ్ ప్రారంభించే అవకాశాలు లేకపోలేదు. భారత్ మరోసారి ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లతో కొనసాగితే.. జింబాబ్వే ప్లాన్ అమలయ్యే అవకాశముంది. అందుకే స్ట్రైక్ బ్యాటర్‌గా సంజూ శాంసన్‌ను పంపితే.. స్పిన్ వ్యూహాన్ని తిప్పికొట్టొచ్చు. స్పిన్‌ బౌలింగ్‌లో మంచి రికార్డులు ఉన్న సంజూ.. ఆరంభంలోనే గేమ్‌ను నియంత్రించే అవకాశం ఉంది. స్పిన్ బౌలింగ్‌ను సంజూ బాగా ఎదురుకొంటాడు. అలానే ఫాస్ట్ బౌలింగ్‌లో కూడా భారీ షాట్స్ ఆడే సామర్థ్యం సంజూ సొంతం.

Also Read: T20 World Cup Fastest Fifties: టీ20 వరల్డ్‌కప్‌లలో ‘యువరాజ్’ సింగ్.. ఆల్ టీమ్స్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీస్ లిస్ట్ ఇదే!

టీ20 ప్రపంచకప్‌ 2026లో ఒక మ్యాచ్ ఆడిన సంజూ శాంసన్‌.. 8 బతుల్లోనే 22 రన్స్ చేశాడు. మరోసారి దూకుడు ఇన్నింగ్స్ ఆడుతాడని ఫాన్స్ నమ్మకంగా ఉన్నారు. సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు భారత జట్టుకు కూడా కావాల్సింది అదే. మరోవైపు ఆడిన మ్యాచులలో అభిషేక్ శర్మ విఫలమయ్యాడు. అభిషేక్ స్థానంలో సంజూ జట్టులోకి వస్తే.. జట్టుకు ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘సమయం ఆసన్నమైంది సంజూ’, ‘ఇక టీమిండియాకు నువ్వే దిక్కు సంజూ’ అంటూ ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి టీమ్ మేనేజ్‌మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఏదేమైనా సరైన ప్లేయింగ్ ఎలెవన్ ఎంపికే మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.