Reading Time: < 1 minute
Tirumala 300 Special Darshan Tickets Release Today

Tirumala: తిరుమలలో శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. ఇవాళ (ఫిబ్రవరి 24న) మే నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల కానున్నాయి. కాసేపట్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రిలీజ్ చేయనున్నారు. అలాగే, తిరుమల, తిరుపతి గదుల కోటాను కూడా విడదల కానున్నాయి.

ఇక, మధ్యాహ్నం 3గంటలకు ఆన్​ లైన్​లో ఫిబ్రవరి 27వ తేదీన శ్రీవారి సేవా, పరకామణి సేవ కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవా, పరకామణి సేవ కోటాను ఫిబ్రవరి 27న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు దేవస్థానం బోర్డు అధికారులు చెప్పారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌ సేవ‌లు, ద‌ర్శన టికెట్లు బుక్ చేసుకోవాల‌ని తిరుమల తిరుపతి దేవస్థానం సూచించింది.

మరోవైపు, తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతుంది. ఇక, నిన్న శ్రీవారిని 77, 803 మంది భక్తులు దర్శించుకోగా, 27,766 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.66 కోట్లు వచ్చింది.