Reading Time: < 1 minute

ఇరాన్- ఇజ్రాయిల్ మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన పది విమానాలు శనివారం రద్దయ్యాయి. దేశంలో ఉన్న పలు ఎయిర్ పోర్ట్‌ల నుంచి ఇరాన్ ఇజ్రాయిల్ వెళ్ళే విమానాలు రద్దు కావడం గమనార్హం. ఈక్రమంలో శంషాబాద్ నుంచి దుబాయ్, కతార్ మీదుగా వెళ్ళాల్సిన పలు విమానాలను రదు చేస్తున్నట్లు ఆయా విమానయాన సంస్థలు తెలిపాయి. ఇరాన్‌లో దాడుల తర్వాత డచ్ క్యారియర్ కెఎల్‌ఎం ఆమ్‌స్టర్‌డ్యాం నుంచి టెల్ అవీవ్‌కు వెళ్లే విమానాన్ని రద్దు చేసింది. ఢిల్లీ నుంచి -టెల్ అవీవ్ వెళ్లాల్సిన విమానాన్ని ఎయిర్ ఇండియా దారి మళ్లించింది. ఇజ్రాయెల్ గగనతలం మూసివేయడంతో ఎయిర్ ఇండియా ఢిల్లీ-టెల్ అవీవ్ విమానాన్ని ముంబైకి మళ్లించడం గమనార్హం. కాగా, ఉద్రిక్తలు కొనసాగితే మరిన్ని విమానాలు రద్దయ్యే అవకావం ఉంటుందని విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి.