Reading Time: < 1 minute
Kalyan Bank Employee Suicide Rabies Infection Fear Maharashtra

Rabies fear: మహారాష్ట్రలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కళ్యాణ్‌లో 30 ఏళ్ల బ్యాంక్ ఉద్యోగి ‘‘రేబిస్’’ భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుక్కకాటు తర్వాత తనకు ‘‘రేబిస్ ఇన్ఫెక్షన్’’ సోకుతుందనే భయంతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిసింది. కళ్యాణ్ తూర్పులోని టిస్గావ్ నాకా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతుడిని ఆయుష్ విశ్వనాథ్ అమీన్(30)గా గుర్తించారు. ఇతను 8 ఏళ్లుగా భారత్ బ్యాంక్ థానే బ్రాంచ్‌లో పనిచేస్తున్నారు.

Read Also: Spirit: డార్లింగ్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ‘స్పిరిట్’లో డాన్ లీ క్యామియో? మార్చి 1న అప్‌డేట్ వస్తోందా!

కొన్ని రోజుల క్రితం నాకా ప్రాంతంలో అమీన్ కాలునున వీధి కుక్క కరిచింది. ఈ సంఘటన తర్వాత అతను ఒకే ఒక యాంటీ-రేబిస్ ఇంజెక్షన్ తీసుకున్నాడు. గత నాలుగు రోజులుగా అతడి ప్రవర్తనలో కుటుంబ సభ్యులు అసాధారణ మార్పులు గమనించినట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రేబిస్ లక్షణాలు సోకుతాయనే భయంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్ రాశాడు. కోల్సేవాడా పోలీసులు ఈ ఘటనపై ప్రమాదవశాత్తు మరణంగా నమోదు చేశారు.