Reading Time: < 1 minute
Icc Womens T20 World Cup 2026 Schedule Announced India Vs Pakistan India Vs Bangladesh Match Dates Full Fixtures

T20 World Cup 2026 Womens: ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ టోర్నీ పూర్తి షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించింది. జూన్ 12 నుంచి జూలై 5 వరకు ఇంగ్లాండ్ & వేల్స్‌లో జరిగే ఈ మహాసంగ్రామంలో మొత్తం 12 జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఈ టోర్నీలో హోస్ట్ దేశం ఇంగ్లాండ్‌తో పాటు ఆస్ట్రేలియా, భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ ఇప్పటికే అర్హత సాధించాయి. క్వాలిఫయర్ టోర్నీ ద్వారా బంగ్లాదేశ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్ జట్లు కూడా ప్రవేశం పొందాయి.

Maoist leaders surrender: మావోయిస్టులకు భారీ దెబ్బ.. అగ్రనేతలు దేవుజి, మల్లారాజి రెడ్డి సహా నలుగురు కీలక నేతలు లొంగుబాటు!

ఈ మెగా టోర్నీలో గ్రూప్ వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రూప్–1: ఆస్ట్రేలియా, భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్.
గ్రూప్–2: ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్, ఐర్లాండ్, స్కాట్లాండ్.

భారత్ మ్యాచ్‌లు ఎప్పుడు?
భారత్ తన తొలి మ్యాచ్‌ను జూన్ 14న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా పాకిస్తాన్‌తో ఆడనుంది. జూన్ 17న నెదర్లాండ్స్‌తో హెడ్డింగ్లీ వేదికగా, జూన్ 21న దక్షిణాఫ్రికాతో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో, జూన్ 25న బంగ్లాదేశ్‌తో, జూన్ 28న లార్డ్స్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. టోర్నీ ప్రారంభ మ్యాచ్ జూన్ 12న ఇంగ్లాండ్ – శ్రీలంక మధ్య ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతుంది. సెమీఫైనల్స్ జూన్ 30, జూలై 2 తేదీల్లో ది ఓవల్‌లో నిర్వహించబడతాయి. ఫైనల్ మ్యాచ్ జూలై 5న లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది.

మినీ LED, 108W సౌండ్‌, Quantum డాట్ టెక్నాలజీతో Kodak 65 అంగుళాల IconiK Google TV భారత్‌లో లాంచ్..!

ఇక ఈ మహాసంగ్రామ షెడ్యూల్ ను ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా మాట్లాడుతూ.. మహిళల క్రికెట్ అభివృద్ధికి ఐసీసీ నిరంతర పెట్టుబడులు పెడుతోందని, ఈ టోర్నీ ప్రపంచవ్యాప్తంగా మరింత ఆదరణను తీసుకువస్తుందని తెలిపారు. గత మహిళల వరల్డ్ కప్ విజయవంతంగా నిర్వహించబడిందని, అదే ఉత్సాహాన్ని ఈ టోర్నీలో కొనసాగించాలనే లక్ష్యంతో ఉన్నామని చెప్పారు.