Reading Time: < 1 minute
Kerala High Court To Screen The Kerala Story 2 Censor Certificate Legal Battle

Kerala Story 2: విడుదలకు ముందే ‘‘ ది కేరళ స్టోరీ 2’’ వివాదంగా మారింది. కేరళ రాష్ట్రాన్ని అవమానించేలా సినిమా ఉందనే విమర్శలు రావడంతో కేరళ హైకోర్టు రేపు సినిమా చూస్తామని ప్రకటించింది. సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బెచు కురియన్ థామస్ ఈ కేసుపై మాట్లాడుతూ.. కోర్టులు సాధారణంగా సినిమాల విషయంలో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడకపోయినా కేరళ ప్రజలు లేవనెత్తిన ఆందోళనల్ని విస్మరించలేమని అభిప్రాయంపడింది. కేరళ పేరు సినిమా టైటిల్‌లో ఉండటం కూడా ఒక కారణమని వెల్లడించింది.

Read Also: Conversion-S*x Racket: కిలాడీ సిస్టర్స్.. సె*క్స్, మతమార్పిడి దందా గుట్టురట్టు..

కేరళ పూర్తి సామరస్యంగా జీవిస్తుందని, కానీ కేరళ అంతటా ఇదే పరిస్థితి ఉండనేలా చిత్రీకరించారని, ఇది తప్పుడు సూచన, ఉద్రిక్తతల్ని రేకెత్తిస్తుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నిజజీవితం ఆధారంగా చిత్రీకరించామని చెప్పినప్పటికీ, కేరళ రాష్ట్ర పేరును వాడటం తప్పుడు సంకేతాలను తీసుకెళ్లుతుందని అన్నారు.

సినిమాలో ఏ మతాన్ని లేదా వర్గాన్ని కించపరిచే ఆలోచన లేదని, ఏ నిర్ధిష్ట సమూహాన్ని లక్ష్యంగా చేసుకోలేదని నిర్మాతలు కోర్టుకు తెలిపారు. సినిమాలో ‘‘లవ్ జిహాద్ బాధితులు’’గా చూపించే యువతులు కేరళకు చెందిన వారు కాదని, కానీ టైటిల్ లో కేరళ పేరు వాడి రాష్ట్రాన్ని చెడుగా చూపిస్తున్నారని పిటిషనర్లు వాదించారు. ఈ వివాదాస్పద సినిమాను కామాఖ్య నారాయణ్ సింగ్ డైరెక్ట్ చేయగా, విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించారు.