
హైదరాబాద్: హైదరాబాద్ సిటీలో వర్షం కురిసింది. చిరు జల్లులు భాగ్య నగరాన్ని చాలా రోజుల తర్వాత పలకరించాయి. అబిడ్స్, బషీర్ బాగ్, సైఫాబాద్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. మీర్ పేట్, బడంగ్ పేట్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎల్బీ నగర్, మలక్ పేట్, సరూర్ నగర్, చార్మినార్, బీఎన్ రెడ్డి, ఉప్పల్, నాగోల్, అంబర్ పేట్, వనస్థలిపురం, హయత్ నగర్ ప్రాంతాల్లో ఈదురు గాలులు వీచాయి.
HyderabadRains ALERT 1 ⚠️⛈️
INTENSE THUNDERSTORMS with ISOLATED HAILSTORMS across South, East Hyderabad City towards Lb Nagar, Saroornagar, Malakpet, Charminar, BN Reddy, Nagole, Uppal, Amberpet, Vanasthalipuram, Hayathnagar
These are slow moving storms, this will continue for…
— Telangana Weatherman (@balaji25_t) February 23, 2026
వికారాబాద్ ప్రాంతంలో వీస్తున్న పెను గాలులు హైదరాబాద్ సిటీ వైపునకు వేగంగా దూసుకొస్తున్నాయి. ఈ ప్రభావంతో.. గచ్చిబౌలి, రాజేంద్ర నగర్, లింగంపల్లి ప్రాంతాల్లో సాయంత్రం 6 తర్వాత ఈదురు గాలులు, చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా చిరు జల్లులు కురిశాయి. మధ్యాహ్నం నుంచి వాతావరణం మారిపోయింది. సోమవారం ఉదయం ఎండ తీవ్రత ఉండగా.. మధ్యాహ్నం తరువాత ఆకాశం మబ్బు పట్టి వాతావరణం చల్లబడింది.
హైదరాబాద్ సిటీలో మాత్రమే కాదు తెలంగాణలో పలు చోట్ల వర్షం కురిసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది.
ఇక సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కూడా ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. రాళ్ల వర్షం పడడంతో పలు బోర్డులు, రేకుల ఇండ్లు పాక్షికంగా ధ్వంసమైపోయాయి. గాలుల ధాటికి ఫ్లెక్సీలు కొట్టుకుపోయాయి. రోడ్లు జలమయం అవడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు.