Reading Time: < 1 minute

Gavaskar– Indian Team: ఈగోను వదిలి పెట్టి.. జింబాబ్వే మ్యాచ్కి ఈ ఒక్క మార్పుతో వెళ్లండి 

Caption of Image.

Gavaskar– Indian Team: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ అనుసరించిన విధానంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిస్థితులకు తగ్గట్టు ఆడకుండా, టీమిండియా ఓవర్ యాక్షన్ చేసిందని విమర్శించారు. ఆటగాళ్లు తమ అహంకారాన్ని (ఈగోను) పక్కన పెట్టి ఆడాలని స్పష్టం చేశారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన భారత్ కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయి, 76 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది గవాస్కర్ అన్నారు. 

దక్షిణాఫ్రికా ఎలా బ్యాటింగ్ చేసిందో భారత్ గమనించలేదు.. ప్రతి బంతికి బౌండరీ కొట్టాలనే ఉద్దేశంతో బ్యాట్ ఊపారని సునీల్ గవాస్కర్ తెలిపారు. పవర్‌ప్లేలోనే భారత్ టాప్-3 బ్యాట్స్‌మెన్ అవుట్ కావడం (26/3) జట్టును వెనక్కి నెట్టిందన్నారు. మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మ ఆటతీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైన రన్‌రేట్ సుమారు 9.5 మాత్రమే, 15 కాదు.. పవర్‌ప్లేలో 55–60 పరుగులు చేసినా సరిపోతుంది అని అన్నారు. కానీ తొందర పాటు నిర్ణయాలు భారత్ పతనానికి కారణమయ్యాయని సునీల్ స్పష్టం చేశారు.

ఈ మ్యాచ్‌తో ఐసీసీ టోర్నీల్లో భారత్ విజయాల పరంపరకు తెరపడింది. దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 187/7 పరుగులు చేయగా, డేవిడ్ మిల్లర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. భారత్ తరఫున శివమ్ దూబే మాత్రమే కొంత పోరాటం చేయగా, మిగతా బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమయ్యారు.
ఫలితంగా టీ20 వరల్డ్ కప్‌ల్లో భారత్‌కు పరుగుల పరంగా అతిపెద్ద ఓటమిగా నిలిచింది.

©️ VIL Media Pvt Ltd.