Reading Time: < 1 minute

ఎస్సీ వెల్ఫేర్ కమిష నర్‌‌‌‌గా విజయేంద్ర బోయి బాధ్యతలు

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ సంక్షేమ శాఖ కమిషనర్‌‌, ఎస్సీ గురుకులాల సెక్రటరీగా ఐఏఎస్ అధికారి విజయేంద్ర బోయి బాధ్యతలు చేపట్టారు. శనివారం మసాబ్ ట్యాంక్‌‌లోని డీఎస్‌‌ఎస్ భవన్‌‌లో ఉన్న కమిషనరేట్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు కమిషనర్‌‌గా ఉన్న సబ్యసాచి ఘోష్, అదనపు బాధ్యతలు నిర్వర్తించిన సెక్రటరీ కృష్ణ ఆదిత్యలను ప్రభుత్వం రిలీవ్ చేసింది. 

బాధ్యతలు స్వీకరించిన అనంతరం విజయేంద్ర మాట్లాడారు. ఎస్సీల సంక్షేమం, అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. ముఖ్యంగా ఎస్సీ గురుకులాలను ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతానని, రానున్న ఇంటర్, టెన్త్, ఎప్‌‌సెట్ పరీక్షల్లో విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించేలా ప్రత్యేకంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.