Reading Time: < 1 minute
Tamannah Bhatia Interview On Glamour And Success Ranger Movie Updates

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు గత పదిహేనేళ్లుగా తనదైన ముద్ర వేస్తూ, నేటితరం హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్న నటి తమన్నా భాటియా. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ‘మిల్కీ బ్యూటీ’, తాజాగా సినిమా పరిశ్రమలోని గెలుపోటములపై స్పందించింది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం వెనుక ఉన్న అసలు రహస్యం కేవలం అందం మాత్రమే కాదని చెబుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Also Read : Rakul: ఆ విషయంలో.. ఆడియన్స్‌ని మోసం చేయలేను..

తమన్నా తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ‘సినిమా ఇండస్ట్రీలో ఏదీ శాశ్వతం కాదు, ప్రతి శుక్రవారం ఇక్కడ తలరాతలు మారిపోతాయి.. మీరు ఎంత కాలం నుంచి పనిచేస్తున్నారు లేదా గతంలో ఎంత గొప్పగా చేశారు అన్నది ముఖ్యం కాదు, ఆ వారం విడుదలయ్యే సినిమా ఫలితమే ప్రజలు మిమ్మల్ని చూసే విధానాన్ని మారుస్తుంది. అందుకే ఈ పరిశ్రమ ఎవరికైనా వినయాన్ని నేర్పుతుంది’ అని తమన్నా అభిప్రాయపడింది. అలాగే

‘ఇక్కడ సక్సెస్ ఉన్నప్పుడే గౌరవం దక్కుతుంది, అది తనను ఎప్పుడూ నేల మీద ఉండేలా చేస్తుంది’ అని ఆమె చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తన గ్లామర్ గురించి వస్తున్న వార్తలపై తమన్నా చాలా స్పష్టంగా స్పందించింది.. ‘నేను కేవలం అందంగా ఉన్నాననో లేక తెల్లగా ఉన్నాననో నాకు అవకాశాలు వస్తాయని నేను ఎప్పుడూ భ్రమపడలేదు. నేను కేవలం ఒక గ్లామర్ బొమ్మను మాత్రమే కాదు.. అలా ఎవరైనా నాకు పని ఇస్తారని నేను తప్పుడు అంచనా వేయలేదు. అదే సమయంలో, నేను తెలివైన దాన్ని కాదని ఎవరైనా అనుకున్నా నాకు ఎప్పుడూ సమస్యలేదు. నా పని నేను చేసుకుంటూ వెళ్లడమే నాకు తెలుసు’ అంటూ తన ఆత్మవిశ్వాసాన్ని చాటుకుంది.