Reading Time: < 1 minute
Harish Shankar Denies Political Satires In Pawan Kalyan Ustaad Bhagat Singh Film

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజగా ఈ విడుదలైన ఈ సినిమాలోని సెకండ్ సాంగ్  సాంగ్ మరియు అందులోని డైలాగులు ప్రత్యర్థి రాజకీయ పార్టీలను ఉద్దేశించినవేనని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అయితే, ఈ వార్తలను దర్శకుడు హరీష్ శంకర్ తాజాగా ఖండించారు.

Also Read : PEDDI : పెద్ది సెకండ్ సింగిల్ వచ్చేస్తోంది

సినిమా వేరు, రాజకీయం వేరు అనే సూత్రాన్ని పవన్ కళ్యాణ్ గట్టిగా నమ్ముతారని హరీష్ శంకర్ తెలిపారు. షూటింగ్ ప్రారంభంలోనే పవన్ తమకు ఒక స్పష్టమైన ఇన్స్ట్రక్షన్ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. “సినిమాలో రాజకీయాల జోలికి వెళ్లొద్దు, ఏ వ్యక్తిని లేదా ఏ పార్టీని టార్గెట్ చేయకూడదు” అని పవన్ స్వయంగా చెప్పినట్లు హరీష్ స్పష్టం చేశారు. కేవలం వినోదం పంచడమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు.  రాజకీయంగా విభిన్న ధృవాలు అయినప్పటికీ, నటుడు ప్రకాష్ రాజ్ తో కలిసి పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటిస్తున్నారు. దీనిపై హరీష్ శంకర్ స్పందిస్తూ.. “రాజకీయ విభేదాలు ఉన్నా, నటన విషయంలో పవన్ కళ్యాణ్ గారి ప్రొఫెషనలిజం అద్భుతం. ఆయన వ్యక్తిగత భావజాలాన్ని సినిమా సెట్స్‌లోకి తీసుకురారు” అని కొనియాడారు. ఈ సినిమాలో ఎవరినీ తక్కువ చేసే ఉద్దేశం లేదని, కేవలం ప్రేక్షకులను అలరించడానికే కొన్ని పవర్‌ఫుల్ డైలాగులు రాశామని హరీష్ శంకర్ తెలిపారు. కాబట్టి, సోషల్ మీడియాలో వస్తున్న పొలిటికల్ సెటైర్ల వార్తల్లో నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది.