Reading Time: < 1 minute

విద్యార్థులకు వేధింపులు ఆపకపోతే.. మరోసారి ఉద్యమం చేస్తాం: కేంద్రప్రభుత్వానికి సీజేపీ వార్నింగ్

Caption of Image.

విద్యార్థులను కేసుల పేరుతో వేధింపులు వెంటనే ఆపాలని కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే  కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులపై వేధింపులు కొనసాగితే  మరోసారి ఉద్యమిస్తామని హెచ్చరించారు. పోలీసులు విద్యార్థులను వేధిస్తున్నారు,  ప్రభుత్వం విద్యార్థులను లక్ష్యంగా చేసుకోవడం ఆపాలని దీప్కే సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

తనను అక్రమంగా పోలీసులు నిర్భంధించారని, తన కుటుంబంపై బలవంతపు చర్యలు దిగుతున్నారని సీజేపీ ఫుడ్ వాలంటీర్ జునైద్ మంగళవారం (జూలై28) ఉదయం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

►ALSO READ | దేశం కోసం మీ కంటే.. Gen Z  చేసిందే ఎక్కువ..కంగనాపై సీజేపీ  విమర్శలు

నిరసనకారులపై అన్ని కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలని, విద్యార్థులను విడుదల చేయాలని  ఢిల్లీ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, బీజేపీపాలిత రాష్ట్రాల్లో ఎఫ్ ఐఆర్ లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు దీప్కే. అలా చేయడంలో విఫలమైతే మళ్లీ మేం నిరసనలకు దిగాల్సి వస్తుందని రేపటి(బుధవారం) లోగా జరగాలని డిమాండ్ చేశారు దీప్కే. 

©️ VIL Media Pvt Ltd.