Reading Time: < 1 minute

Ravi Shastri: భారత్ జట్టులో మార్పులు చేయాల్సిందే.. లేకపోతే సెమీస్కి వెళ్లడం కష్టమే!

Caption of Image.

Ravi Shastri: టీ20 వరల్డ్ కప్ సూపర్–8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఎదుర్కొన్న భారీ ఓటమిపై మాజీ భారత హెడ్ కోచ్ రవి శాస్త్రీ తీవ్రంగా మండిపడ్డారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు పరాజయంతో సెమీఫైనల్ అవకాశాలను మరింత క్లిష్టంగా మారిందని అన్నారు. ఈ ఓటమి టోర్నీ చివరి దశలో కాకుండా తొలినాళ్లలో రావడం మంచిదేనని అభిప్రాయపడ్డారు. ఇది జట్టుకు అవసరమైన “వేక్-అప్ కాల్” అని పేర్కొన్నారు.

సెమీఫైనల్స్‌కు చేరే శక్తి ఉన్న జట్టుతోనే ఈ ఓటమి రావడం జరిగింది అని రవి శాస్త్రీ అన్నారు. ఇది భారత్‌కు అవసరమైన షేక్-అప్ కావోచ్చు.. వ్యూహం, జట్టు కూర్పును పునరాలోచించాల్సిన అవసరం మరింత ఉంది.. టీమిండియా తప్పకుండా ఈ అనుభవం నుంచి నేర్చుకుని తిరిగి బలంగా వస్తుంది అని ICC రివ్యూలో ఆయన చెప్పారు. సూపర్–8 దశలో మరో మ్యాచ్ ఓడితే తీవ్ర ఒత్తిడిలో పడాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు.

►ALSO READ | Harmanpreet Kaur: టీమిండియాకి బిగ్ షాక్.. గాయంతో ఆస్ట్రేలియాతో మ్యాచ్కి కెప్టెన్ దూరం
 
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్ ను ఆడించకపోవడం పెద్ద చర్చకు దారి తీసింది అని మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రీ పేర్కొన్నారు. అతని స్థానంలో ఆడిన వాషింగ్టన్ సుందర్ ఆశించిన స్థాయిలో రాణించలేదు.. జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌కు అక్షర్‌ను తప్పకుండా తీసుకురావాలని సూచించారు. అవసరమైతే అక్షర్, వాషింగ్టన్ ఇద్దరినీ ఆడించాలని తెలిపారు. అక్షర్ అనుభవం జట్టుకు చాలా అవసరం అవుతుంది.. అతడు ఆడితే నంబర్–8 వరకూ బ్యాటింగ్ బలం పెరుగుతుందని విశ్లేషించారు. హార్దిక్ పాండ్యా 5, శివమ్ దూబే 6, వాషింగ్టన్ సుందర్ 7, అక్షర్ పటేల్ 8గా బ్యాటింగ్ చేయవచ్చు.. అవసరమైతే అక్షర్ నంబర్–5లో కూడా బ్యాటింగ్ చేస్తాడని వెల్లడించారు.  అక్షర్, వాషింగ్టన్ ఇద్దరూ ఆడితే, తుది జట్టు కూర్పు కోసం కఠిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆ పరిస్థితిలో రింకూ సింగ్ కు అవకాశం దక్కకపోవచ్చు అన్నారు. 8 మంది బ్యాటర్లు ఉన్నప్పటికీ టీ20లో గెలవలేకపోతే, ఎక్కడో లోపం ఉన్నట్టే అని  రవి శాస్త్రి చెప్పారు. 

©️ VIL Media Pvt Ltd.