Reading Time: < 1 minute

నడిగడ్డ నుంచే కొత్త పార్టీ పెడ్తా..MPTC, ZPTC ఎన్నికల్లో పోటీ చేస్తా: కవిత

Caption of Image.

జోగులాంబ గద్వాల నుంచే కొత్త పార్టీ పెడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. జోగులాంబలో రైతు సంఘర్షణ సభలో మాట్లాడిన ఆమె.. తన ప్రతి కార్యక్రమాన్ని గద్వాల నుంచే ప్రారంభిస్తానని చెప్పారు. ఎంపీటీసీ ,జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి..సత్తా చాటుతామన్నారు. ప్రతీ మండలంలో అభ్యర్థిని బరిలో దింపుతామన్నారు కవిత.నడిగడ్డ ప్రజలు నిజాయితీ ప్రజలని చెప్పారు కవిత.

ఆడవాళ్లు లేనిదే వ్యవసాయం ముందుకు సాగదన్నారు కవిత.  వారం రోజుల్లో సీడ్ పత్తి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నడిగడ్డను బీఆర్ఎస్ మోసం చేసిందని..కృష్ణా,తుంగభద్రా నదులున్నా నడిగడ్డకు నీళ్లు రావట్లేదని విమర్శించారు.  అత్తా, అల్లుడు తప్ప..ఇక్కడ కొత్త లీడర్లు లేరా అని ప్రశ్నించారు కవిత. ప్రభుత్వం ఇచ్చిన రూ. 2500 హామీ ఎక్కడకు పోయిందన్నారు. రైతన్నల కోసం జాగృతి పోరాడుతుందన్నారు కవిత. 

©️ VIL Media Pvt Ltd.