Reading Time: < 1 minute

బైక్ ను ఢీ కొట్టిన కంటైనర్..ఇద్దరు యువకులు స్పాట్ డెడ్

Caption of Image.

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగర్‌గూడ చౌరస్తాలో బైక్‌ను కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతులు  హైతాబాద్ గ్రామానికి చెందిన అజయ్(19), ఉదయ్‌కిరణ్(20) గా  గుర్తించారు.  గాయాలైన అజమ్ అనే యువకుడిని  వెంటనే దగ్గరలోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు.

పోలీసులు  మృత దేహాలను  చేవెళ్లలోని ప్రభుత్వం హాస్పిటల్ కి తరలించారు. అజయ్ అనే వ్యక్తికి అమ్మ లేదు నాన్న ఉన్నాడు.  తను రోజువారి కూలీల పని చేస్తుంటాడు. ఉదయ్ కిరణ్ అనే వ్యక్తి కూడా  కూలీగా పనిచేస్తూ ఉంటాడు. అజమ్ అనే వ్యక్తి చికెన్ షాప్ లో పని చేస్తాడు. ఇతనికి తల్లిదండ్రులు ఎవరూ లేరు. కంటైనర్ యజమానిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.