Reading Time: < 1 minute

Aaya Sher Promo: బొట్టు బొట్టు ఆకలి ఉంది.. మెట్టు మెట్టు ఎక్కుతారా.. నాని ‘ఆయా షేర్’ సాంగ్‌ ప్రోమో బ్లాస్ట్

Caption of Image.

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘ది ప్యారడైజ్’(The Paradise). ‘దసరా’వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ మూవీపై అంచనాలు రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. లేటెస్ట్గా సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 

ది ప్యారడైజ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఆయా షేర్’ (Aaya Share) అనే సాంగ్‌ ప్రోమోను పంచుకుంటూ సాలిడ్ క్యాప్షన్ పెట్టారు. ‘సింహం తన గుండెల్లోంచి నృత్యం చేయడం ఎప్పుడైనా చూశారా? రేపు మీరు చూస్తారు. దాని గర్జన యొక్క తాలూకూ చిన్న వీడియో చూసేయండి ఇప్పుడు’’ అని బ్లాస్ట్ ఇచ్చారు.

►ALSO READ | VijayRashmika: సోమవారం ఉదయమే ఉదయ్‌పూర్ చేరిన రష్మిక–విజయ్.. లగ్జరీ విల్లాల్లో అతిథులకి ప్రత్యేక ఏర్పాట్లు!

‘‘బొట్టు బొట్టు ఆకలి ఉంది.. ఆయా షేర్, మెట్టు మెట్టు ఎక్కుతారా.. ఆయా షేర్, పేరు పత్తా లేనోనిరా.. ఆయా షేర్.. చూస్కో ప్యారడైజ్కే అడ్రస్ అయితా.. ఆయా షేర్’’ అనే పదాలు మట్టివాసనలో యుద్దాన్ని సృశిస్తున్నాయి. మాస్ ఆడియెన్స్కు ఫుల్ కిక్కిచ్చే విధంగా అనిరుధ్ మ్యూజిక్, కాసర్ల శ్యామ్ లిరిక్స్ ఉన్నాయి. ఈ ఆయా షేర్ పూర్తి సాంగ్ ఊరమాస్ బీట్తో రేపు ఫిబ్రవరి 24న దుమ్మురేపనుంది. 

©️ VIL Media Pvt Ltd.