Reading Time: < 1 minute
Rajya Sabha : టీడీపీ నుంచి పెద్దల సభకు వెళ్లేది వీళ్లే.. ముగ్గురు పేర్లను ఖరారు చేసిన చంద్రబాబు

ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే అభ్యర్ధులు ఎంపికపై కసరత్తు కొలిక్కి వచ్చింది. టీడీపీ నంచి ముగ్గురు, జనసేన నుంచి ఒకరు రాజ్యసభకు ఎంపిక కావాల్సి ఉండగా.. జనసేన నుంచి రాజ్యసభ అభ్యర్థిగా లింగమేనని రమేశ్ పేరును ఇటీవలే అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీంతో జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ శనివారం నామినేషన్ కూడా దాఖలు చేసి రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.

మరోవైపు టీడీపీ నుంచి ముగ్గురు నేతలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజ్యసభ ఆశావాహులుగా ప్రచారంలో ఉన్న పలువురు నేతలు టీడీపీ కార్యాలయానికి వచ్చి చంద్రబాబును కలుస్తున్నారు. వారిలో సూదీర్ఘంగా జరిగిన చర్చల తర్వాత ముగ్గురు పేర్లను ఆయన ఖరారు చేశారు. వారిలో చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్‌ ఉన్నారు. టీడీపీ పార్టీ నుంచి రాజ్యసభకు ఈ ముగ్గురు నేతలే వెళ్లనున్నట్టు పార్టీ అధికారికంగా ప్రకటించింది. దీంతో రాజ్యసభ అభ్యర్థులుగా సోమవారం వీరు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.