
కోకాపేటలోని శారదా పీఠానికి కేటాయించిన భూమిని ఆ పీఠానికే కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. పీఠం భూములు జల మండలికి కేటాయించిన నేపథ్యంలో అక్కడ సాగుతున్న నిర్మాణ పనుల విషయాలను పీఠం ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో శనివారం సాయంత్రం సమావేశమయ్యారు. కోకాపేట భూముల్లో పీఠం ఆధ్వర్యంలో వివిధ నిర్మాణాల తాజా స్థితి గురించి ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పీఠం భూములను జలమండలికి కేటాయించే సమయంలో నిర్మాణాల స్థితి గురించి ఎందుకు తెలియజేయకలేదని అధికారులపై ముఖ్యమంత్రి మండిపడ్డారు. జల మండలికి కేటాయింపులు చేసిన భూములను రద్దు చేసి పీఠానికే ఆ భూములను కొనసాగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మంత్రి శ్రీధర్‌బాబును కలిసి నిర్మాణాలు, ఇతర పరిస్థితుల గురించి వివరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పీఠం ప్రతినిధులకు సూచించారు.