Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి ఇరాన్‌పై సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. ఈ దాడులు తీవ్ర రూపం దాల్చి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలు నివారించాలని భారత్ సూచించింది. పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది. దౌత్య మార్గాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని కోరింది. దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని పేర్కొంది. పశ్చిమాసియాలో ఉన్న భారతీయులతో సంప్రదింపులు జరుపుతోంది. అక్కడ ఉండే భారతీయులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.