Reading Time: < 1 minute
Tollywood: 50 సెకన్ల యాడ్‌కు రూ. 5 కోట్లు.. వివాదాలతోనే ఫేమస్.. ఈ హీరోయిన్ ఎవరంటే.?

సౌత్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ స్టేటస్ అస్వాదిస్తోంది నయనతార. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి లేడీ సూపర్ స్టార్ క్రేజ్‌ను సాధించింది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి, అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక గతంలో ఆమె కేవలం 50 సెకన్ల నిడివి గల ఒక యాడ్ కోసం ఏకంగా ఐదు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో ఆమెకు ఇండస్ట్రీలోకి రావాలనే ఉద్దేశం లేదు. ఇంగ్లీష్ డిగ్రీ పూర్తిచేసిన ఆమె, చార్టెడ్ అకౌంటెంట్ కావాలని అనుకుంది. కానీ అనుకోకుండా సినీ రంగంలోకి అడుగుపెట్టి, తన ప్రతిభతో ఉన్నత స్థాయికి చేరుకుంది. ఇప్పటివరకు 80కి పైగా సినిమాల్లో నటించిన నయనతార.. తనను తాను కేవలం దక్షిణాది పరిశ్రమకే పరిమితం చేసుకోలేదు. రజనీకాంత్, షారుఖ్ ఖాన్, నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, జయరాం లాంటి ప్రముఖ నటులతో కలిసి పనిచేసింది.

నయనతార వ్యక్తిగత జీవితం కూడా సినిమా వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. 2015లో నానుమ్ రౌడీ ధాన్ సినిమా సెట్‌లో దర్శకుడు విగ్నేష్ శివన్‌ను కలిసిన ఆమె, ఆరేళ్ల ప్రేమ బంధం తర్వాత 2022లో వివాహం చేసుకుంది. ఈ జంట సరోగసీ ద్వారా ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. నయనతార వివాహ వేడుకను డాక్యుమెంటరీగా చిత్రీకరించి నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేసింది. జవాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నయనతార, ఆ చిత్రం విజయంతో హిందీ సినీ ఇండస్ట్రీలోనూ వరుస అవకాశాలు దక్కించుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం ఆమె ఒక సినిమాకు సుమారు రూ. 10 కోట్ల పారితోషికం తీసుకుంటోందట.

 

View this post on Instagram

 

A post shared by N A Y A N T H A R A (@nayanthara)