Reading Time: < 1 minute
Milk Samples Sent To Hyderabad Adulteration Deaths Probe

Adulterated Milk Deaths: రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా మరణాలపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మొత్తం 106 కుటుంబాలకు పాలు విక్రయించారు.. వారిలో 12 మంది కిడ్నీ సమస్యల బారిన పడ్డారు.. నలుగురు మృతి చెందారు అని తెలిపింది. పాలు కొనుగోలు చేసిన మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం.. 73 మంది బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నాం, సాయంత్రానికి రిపోర్ట్స్ వస్తాయని వెల్లడించింది. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు.. పాల వలనే ఈ సంఘటన జరిగిందని నివేదిక వస్తే కానీ ఏం చెప్పలేము.. ఇప్పటికే పాల శాంపిల్స్ ని హైదరాబాద్ కి పంపించాం.. మరో రెండు- మూడు రోజుల్లో నివేదిక వస్తుంది అని కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించింది.

Read Also: Kiran Abbavaram: భారీగా రెమ్యునరేషన్ పెంచిన కిరణ్ అబ్బవరం?

మరోవైపు, రాజమండ్రి డీఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కిడ్నీ సమస్యలతో ఆనూరియా వ్యాధితో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారని తెలిపారు. ఇక, కనుకరత్నం అనే 74 ఏళ్ల వయస్సున్న మహిళ మరణానికి అనూరియాకు సంబంధం లేదని పేర్కొన్నారు. గణేష్ అనే పాల వ్యాపారి సరఫరా చేసిన పాల లోనే కల్తీ జరిగినట్లు నిర్థారణ అయింది. 106 కుటుంబాలకు పాలు సరఫరా చేశారు.. ఇప్పటి వరకు 76 కుటుంబాలలో సర్వే చేశామని తెలియజేశారు. ఇక, పాల వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు.