Reading Time: < 1 minute
Mani Ratnams Next Vijay Sethupathi Steps In After Dhanush Exits

కోలీవుడ్ దిగ్గజ దర్శకులలో ఒకరైన మణిరత్నం ప్రస్తుతం తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్న ఆయనకు, ‘థగ్ లైఫ్’ (Thug Life) ఫలితం కొంత నిరాశను మిగిల్చింది. అయితే, ఇప్పుడు ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామాతో మళ్ళీ ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఈ సినిమా కాస్టింగ్  వ్యవహారం కూడా ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

Also Read : Varun Tej : మెగా ప్రిన్స్ తో కోలీవుడ్ డైరెక్టర్ సినిమా ఫిక్స్

నిజానికి ఈ కథను మణిరత్నం తొలుత శింబు కోసం సిద్ధం చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఆ తర్వాత మణిరత్నం ఇదే కథను ధనుష్‌కు వినిపించారు. స్క్రిప్ట్ నచ్చినప్పటికీ, రెమ్యునరేషన్  విషయంలో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. ఫలితంగా ధనుష్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది.ధనుష్ తప్పుకున్న స్థానంలోకి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి వచ్చి చేరారు. మణిరత్నం చెప్పిన కథను విన్న వెంటనే ఆయన ఓకే చెప్పేశారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించనుంది. విజయ్ సేతుపతి మరియు సాయి పల్లవి కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా ఇది కావడం, దానికి మణిరత్నం దర్శకత్వం వహించనుండటంతో సినిమాపై అంచనాలు ఏర్పడడం కామన్. ఈ క్రేజీ ప్రాజెక్టును లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ‘థగ్ లైఫ్’ చేదు జ్ఞాపకాలను చెరిపివేస్తూ, తన మార్కు ఎమోషన్స్ మరియు విజువల్స్ తో మణిరత్నం ఈసారి గట్టిగా కొట్టబోతున్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.