
టీ20 వరల్డ్ కప్ కీలక మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన టీమిండియా సెమీ ఫైనల్ క్వాలిఫికేషన్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. 76 రన్స్ తేడాతో టీమిండియాను సౌతాఫ్రికా జట్టు ఓడించడమే ఇందుకు కారణం. టీమిండియా నెట్ రన్ రేట్ -3.80కి దిగజారింది. వెస్టిండీస్, జింబాబ్వే.. ఈ రెండు టీమ్స్తో జరగబోయే రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా గెలిస్తే.. టీమిండియా నాలుగు పాయింట్లు సాధిస్తుంది. భారీ పరుగుల తేడాతో ఈ రెండు జట్లను ఓడిస్తే టీమిండియాకు మరింత అడ్వాంటేజ్ ఉంటుంది.
ఇలా జరిగితే.. టీమిండియా నాలుగు పాయింట్లను సాధించి సెమీస్కు అర్హత సాధిస్తుంది. అయితే.. ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది. వెస్టిండీస్ వర్సె్స్ జింబాబ్వే మ్యాచ్లో గెలిచిన టీం సౌతాఫ్రికాను కూడా ఓడించాలి. ఆ సందర్భంలో.. టీమిండియా, సౌతాఫ్రికా, సౌతాఫ్రికాపై గెలిచిన జట్టు నాలుగు పాయింట్లతో సమానంగా నిలుస్తాయి. అప్పుడు నెట్ రన్ రేట్ కీలకం అవుతుంది.
ALSO READ : వరల్డ్ క్రికెట్ లో టాప్‌లో ఉండటమే మా టార్గెట్
A win against Zimbabwe and West Indies won’t also confirm India’s Semi Final qualification.
– It’s all about the NRR game now! pic.twitter.com/yDTVFe162M
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 22, 2026
ఒక్కముక్కలో చెప్పాలంటే.. టీమిండియా సెమీ ఫైనల్ ఆశలు సౌతాఫ్రికా జట్టు మీద ఆధారపడి ఉన్నాయి. జింబాబ్వే, వెస్టిండీస్ రెండు జట్లను ఓడిస్తే టీమిండియాకు నాలుగు పాయింట్లు లభిస్తాయి. అయితే.. సౌతాఫ్రికా కూడా రెండు మ్యాచ్ ల్లో గెలిస్తే సఫారీ జట్టుకు ఆరు పాయింట్లు దక్కుతాయి. అప్పుడు టీమిండియా సెమీస్కు ఈజీగా చేరుకోవచ్చు. అలా కాకుండా.. టీమిండియా ఒక మ్యాచ్లో ఓడిపోయినా టీ20 వరల్డ్ కప్ నుంచి నిరాశతో నిష్క్రమించక తప్పని పరిస్థితి. సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఓడిపోవడం వల్లే ఇన్ని ఈక్వెషన్స్ మధ్య సెమీస్ ఆశలు చిక్కుకుపోయాయి.
లీగ్ దశలో చిన్న జట్లపై బ్యాటింగ్‌లో తడబడిన టీమిండియా కీలకమైన సూపర్–8 రౌండ్ ఆరంభంలోనే చతికిలపడింది. పేరున్న బ్యాటర్లంతా పేలవ ఆటతో నిరాశపరచడంతో ఆదివారం జరిగిన గ్రూప్–1 తొలి పోరులో 76 రన్స్ తేడాతో సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. తొలుత సఫారీ టీమ్ 20 ఓవర్లలో 187/7 స్కోరు చేసింది. అనంతరం ఛేజింగ్‌లో ఇండియా 18.5 ఓవర్లలో 111 రన్స్‌కే కుప్పకూలింది.