Reading Time: < 1 minute
Cm Chandrababu Announces Rs 10 Lakh Ex Gratia Warns Adulterators Of Severe Action

Rajahmundry Milk Adulteration Case: రాజమండ్రి సంఘటన లో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల నష్ట పరిహారం ప్రకటించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పాలు కల్తీ జరిగితే ఎట్టి పరిస్థితుల్లో కఠిన చర్యలు ఉంటాయన్నారు.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు.. రాజమండ్రి ఘటన పై కీలక ప్రకటన చేశారు. ఉదాసీనంగా ఉండదని తేల్చిచెప్పారు సీఎం చంద్రబాబు… పాల నమూనాల ల్యాబ్స్ కు పంపామని.. త్వరలో రిపోర్ట్స్ వస్తాయన్నారు చంద్రబాబు.. మొత్తంగా రాజమండ్రి ఘటనను చాలా సీరియస్‌గా తీసుకుంటాం అన్నారు.. నరసాపురంలోని వరలక్ష్మి డెయిరీ నుంచి పాలు సరఫరా చేశారని వెల్లడించిన ఆయన.. పాల నమూనాలు సేకరించి హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపాం.. పాలు కల్తీ జరిగి ఉంటే క్షమించేది లేదని హెచ్చరించారు.. లాలా చెరువు ప్రాంతంలో నలుగురు మృతిచెందారు.. ఎనిమిది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Read Also: Kim Jong Un: 13 ఏళ్ల కుమార్తెకు కీలక బాధ్యతలు అప్పగించిన ఉత్తర కొరియా నియంత