Reading Time: < 1 minute
Political Harassment Family Targeted Anantha Babu Statement

MLC Anantha Babu: NTV ఛానల్ తో ఎమ్మెల్సీ అనంత బాబు మాట్లాడుతూ.. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో నా భార్యను అన్యాయంగా ఇరికించారు అని పేర్కొన్నారు. నేను పరారీలో లేనని, ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని తేల్చి చెప్పారు. వ్యక్తిగత పనులతో బిజీగా ఉండటాన్ని పరారీగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డిపాల్ట్ బెయిల్‌ను సుప్రీంకోర్టు పర్మినెంట్ చేసింది.. కూటమి ప్రభుత్వం తనను, తన కుటుంబాన్ని వేధిస్తోంది.. నన్ను, నా భార్యను కావాలనే టార్గెట్ చేశారు అని ఆరోపించారు. హైకోర్టులో చాలెంజ్ చేసిన తర్వాత చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు వచ్చాయి.. ఇక, తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అంశాన్ని డైవర్ట్ చేయడానికే కేసును హైలైట్ చేస్తున్నారు.. వైసీపీలో యాక్టివ్‌గా ఉన్నవారిని టార్గెట్ చేస్తున్నారు అంటూ అనంత బాబు మండిపడ్డారు.

అయితే, పోలీసులు సహకరించారన్న వార్తల్లో నిజం లేదు అని ఎమ్మెల్సీ అనంత బాబు పేర్కొన్నారు. సహకారం ఉంటే ఏడు నెలలు జైలులో ఉండాల్సిన అవసరం లేదు అని వెల్లడించారు. నా కేసును కులం, పార్టీకి లింక్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఇది అనంత బాబు వ్యక్తిగత అంశంగా మాత్రమే చూడాలి అని కోరారు.