Reading Time: < 1 minute
The Paradise First Lyricle Song Aayasher Promo Out Now

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘దసరా’ వంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి నాని చేస్తున్న రెండో ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ (The Paradise). ఈ హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సింగిల్‌కు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమాలోని మొదటి పాట ప్రోమో కొద్ది సేపటి క్రితం రిలీజ్ చేసారు మేకర్స్. నాని మాస్ అవతార్ లుక్ బాగుంది. తమిళ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్న ఆయా షేర్ ఫుల్ సాంగ్ ను ఈ  మంగళవారం అనగా ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నారు. ఈ సాంగ్ నాని పాత్ర స్వభావాన్ని మరియు సినిమాలోని మాస్ ఎనర్జీని ప్రతిబింబించేలాఉండబోతుంది. ‘దసరా’లో చమ్కీల అంగీలేసి అలరించిన నాని, ఈసారి అంతకు మించి ఉండేలా ఒక పవర్‌ఫుల్ అంథెమ్‌తో రాబోతున్నారు. ఈ సినిమా కోసం నాని తన లుక్‌ను పూర్తిగా మార్చుకోవడం విశేషం. మునుపెన్నడూ చూడని విధంగా ఒక ఊర మాస్ పాత్రలో ఆయన కనిపించబోతున్నారు. శ్రీకాంత్ ఓదెల మార్క్ రా అండ్ రస్టిక్ విజువల్స్ నాని నటన వెరసి ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద మరో మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Also Read : NBK : బాలయ్య – గోపిచంద్ మలినేని.. అల్లాడించబోతున్నారు