Reading Time: < 1 minute
Gold Silver Prices Surge Amid Israel Iran War Gulf Tensions

Gold and silver prices: సామాన్యుల పాలిట యుద్ధం శాపంగా మారింది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం, గల్ఫ్‌లో యుద్ధ వాతావరణంతో ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు కొండెక్కాయి. ఇవాళ ఒక్కరోజే ధరలు భారీగా పెరిగాయి. నిన్న రూ. 2,95,000 ఉన్న సిల్వర్ ధర.. ఇవాళ ఒక్క రోజే రూ.25 వేలు పెరిగింది. 3 లక్షల మార్కు దాటి ధర రూ.3,20,000కు చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,54,650 కి చేరింది. నిన్న రూ. 1,48,100 గానే ఉంది. ఒక్కరోజులోనే రూ. 6,550 పెరిగింది. 18 క్యారెట్ల బంగారం ధర అయితే రూ. 1,21,180 నుంచి రూ. 1,26,530 కి పెరిగింది. ఒక్కరోజే రూ. 5,350 పెరిగింది.

READ MORE: Iran-Israel War: మోడీ ఇజ్రాయెల్‌ పర్యటనపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..

ఇరాన్- ఇజ్రాయెల్, యూఎస్ మధ్య క్షిపణి దాడులు, ప్రతిదాడులు చోటుచేసుకోవడం గ్లోబల్ మార్కెట్లలో ఆందోళన వాతావరణాన్ని సృష్టించింది. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సేఫ్ హెవెన్‌గా భావించే బంగారం, వెండిపై మళ్లీ భారీగా కొనుగోళ్లు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. విశ్లేషకుల ప్రకారం.. ఇరాన్ అణు చర్య మరోసారి ఊపందుకోనుంది. అమెరికా తాజాగా ఆంక్షలు కఠినతరం చేయడం వంటి అంశాలు మార్కెట్‌లో రిస్క్ ప్రీమియంను పెంచాయి. భౌగోళిక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నప్పుడు బంగారం, వెండి ధరలు వేగంగా పెరగడం కామన్. అందుకే సోమవారం మార్కెట్ ప్రారంభం కాగానే భారీ ఒడిదుడుకులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రేపు, ఎల్లుండి స్టాక్ మార్కెట్ బంద్ కావడంతో సోమవారం పరిస్థితులు ఎలా ఉంటాయి? అనే అంశంపై అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

READ MORE: Virender Sehwag: “13 ఓవర్లలో చేజ్ పాకిస్థాన్ వల్ల కాదు”.. పాక్ సెమీస్ ఆశలపై సెహ్వాగ్ క్లియర్ స్టేట్‌మెంట్