Reading Time: < 1 minute
Health Tips: తిన్న వెంటనే నడక.. ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా? నిపుణులు చెప్పిందేంటి?

భోజనం చేసిన వెంటనే నడవడం ఖచ్చితంగా ప్రయోజనకంగా ఉంటుంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ అది మనం నడిచే విధానంపై ఆదారపడి ఉంటుందని అంటున్నారు. తీవ్రమైన వ్యాయామం లేదా వేగవంతమైన నడక కంటే నెమ్మదిగా నడవడం వల్ల ఎక్కువ ప్రయోజనా ఉన్నాయని చెబుతున్నారు. ఎందుకంటే భోజనం చేసిన వెంటనే 60 నుండి 90 నిమిషాలలోపు చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి, భోజనం చేసిన వెంటనే లేదా 15 నిమిషాలలోపు నడవడం వల్ల కండరాలు ఈ గ్లూకోజ్‌ను ఉపయోగించుకుంటాయి, తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు.

నడవడానికి సరైన సమయం ఏది?

నిపుణుల సలహా ప్రకారం.. భోజనం తర్వాత కనీసం 10 నుండి 15 నిమిషాలు విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం. తర్వాత మీరు నెమ్మదిగా నడకను ప్రారంభించచ్చు. ఫుల్‌గా తిన్న తర్వాత వెంటనే వేగంగా నడవడం కన్నా.. నెమ్మదిగా నడవడం మంచింది.దీని వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

భోజనం తర్వాత నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

షుగర్ కంట్రోల్: భోజనం చేసిన 60 నుండి 90 నిమిషాలలోపు నడవడం వల్ల కండరాలు రక్తంలోని గ్లూకోజ్‌ను ఉపయోగించుకుంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలలో పెరుగుదలను నియంత్రిస్తుంది, ఇది ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు, ప్రీడయాబెటిస్ ఉన్నవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

బరువు నిర్వహణ: భోజనం తర్వాత నడవడం వల్ల జీవక్రియ పెరుగుతుంది, కేలరీలు బర్న్ అవుతాయి. ఇది దీర్ఘకాలంలో బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యం: భోజనం తర్వాత క్రమం తప్పకుండా నడవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.

మానసిక శ్రేయస్సు నిద్ర: నడక వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు వంటి ‘మంచి అనుభూతిని కలిగించే’ హార్మోన్లు విడుదలవుతాయి, ఇవి ఒత్తిడిని తగ్గించి, రాత్రిపూట మంచి నిద్ర పొందడానికి సహాయపడతాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.