Reading Time: < 1 minute

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎలైట్ కోలివింగ్ హాస్టల్లో విషాద ఘటన

Caption of Image.

హైదరాబాద్: హైదరాబాద్ గచ్చిబౌలిలో యువతి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన కలకలం రేపింది. గచ్చిబౌలిలోని ఎలైట్ కోలివింగ్ హాస్టల్లో ఉంటున్న మొల్లి దుర్గ (23) ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఐదవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

డెలివరీ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న సాయి కుమార్తో దుర్గ ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. సాయి కుమార్ వేధింపులతో తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. దీంతో.. మనస్థాపానికి గురై హాస్టల్ బిల్డింగ్ 5వ అంతస్తు నుంచి దూకి చనిపోయింది.

తీవ్ర గాయాలైన యువతిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. యువతి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాధితురాలి మావయ్య రవి కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.

►ALSO READ | అమెరికాలో అర్ధరాత్రి పిజ్జా డెలివరీ చేస్తుండగా… మేడ్చల్ కుర్రాడిని కాల్చి చంపేశారు !

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. యువతి ఆత్మహత్యకు కారణమైన నిందితుడు సాయి కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి పోలీసులు కేసు దర్యాప్తు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.