Reading Time: < 1 minute

సూర్యాపేట జిల్లాలో అగ్నిప్రమాదం.. మేళ్లచెరువు రోడ్డులోని చార బయో మాస్ స్టాక్ దగ్గర మంటలు…

Caption of Image.

సూర్యాపేట జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. మేళ్లచెరువు రోడ్డులోని చార బయో మాస్ స్టాక్ పాయింట్ దగ్గర మంటల చెలరేగాయి. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి… మేళ్లచెరువు రోడ్డులో పెద్ద కాలువ సమీపంలోని చార బయోమాస్ స్టాక్ పాయింట్ దగ్గర నిల్వ ఉంచిన పత్తి కట్టల కుప్పకు నిప్పు అంటుకుంది.

ఈ ప్రమాదంలో  ఐదెకరాల్లో పత్తి కట్టే తగలబడింది. స్థానికులసమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

©️ VIL Media Pvt Ltd.