
టాలీవుడ్‌లో ఇప్పుడు బిజినెస్ మెన్ హీరోల సంఖ్య గణనీయంగా పెరిగింది. సినీ రంగంలో దూకుడు చూపిస్తూనే, మన స్టార్లు వ్యాపారంలోనూ అదే జోరును కొనసాగిస్తున్నారు. వారందరికీ సినిమా, బిజినెస్ రెండూ రెండు కళ్ల లాంటివి. తమ సంపాదనను మళ్లీ ఇక్కడే పెట్టుబడిగా పెడుతూ స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా తోడ్పడుతున్నారు. ముఖ్యంగా, మల్టీప్లెక్స్ బిజినెస్ ఈ హీరోలకు ఆదరణ పొందిన రంగం. మహేష్ బాబు ఈ ట్రెండ్‌ను మొదలుపెట్టగా, అల్లు అర్జున్, రవితేజ, విజయ్ దేవరకొండ వంటి ఇతర స్టార్ హీరోలు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్‌ను బెంగళూరులో ప్రారంభించగా, అల్లు అర్జున్ హైదరాబాద్‌లో ఏఏఏ సినిమాస్‌ను స్థాపించారు. రవితేజ హైదరాబాద్‌లో ఏఆర్‌టీ సినిమాస్‌తో, విజయ్ దేవరకొండ తన స్వస్థలం మహబూబ్‌నగర్‌లో ఏవీడీ సినిమాస్‌తో మల్టీప్లెక్స్ రంగంలో తమదైన ముద్ర వేసుకున్నారు. ఈ హీరోలు తమ సినిమా షెడ్యూల్స్‌తో ఎంత బిజీగా ఉన్నా, తమ వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రజినీ, కమల్ మల్టీస్టారర్.. మరి వీరిలో హీరో ఎవరో తెలుసా..?
11 రూపాయలకే సినిమా చూపించిన మేకర్స్..
నిన్న మహేష్.. నేడు ప్రభాస్.. పూరి జగన్నాథ్ పై సంచలన కామెంట్స్