మీ ఫోన్ ఎప్పుడూ సైలెంట్‌లోనే ఉంటుందా? అయితే మీరు ఇతరుల కంటే మానసిక శక్తిలో ఒక అడుగు ముందే ఉన్నారని అర్థం. ఇది కేవలం అలవాటు కాదు, మీ మెదడుపై మీకు ఉన్న నియంత్రణకు సంకేతం. క్యుంగ్ హీ మరియు టెక్సాస్ యూనివర్సిటీ పరిశోధనల ప్రకారం, ఫోన్ శబ్దాలను ఆపేయడం వల్ల ఏకాగ్రత పెరగడమే కాకుండా, ఒత్తిడి కూడా తగ్గుతుందట. అసలు ఫోన్ సైలెంట్‌లో ఉంచే వారిలో ఉండే ఆ ప్రత్యేక లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఫోన్ రింగ్ అయిన ప్రతిసారీ మన ఏకాగ్రత దెబ్బతింటుంది. ఒకసారి డిస్టర్బ్ అయిన మనసు మళ్ళీ పనిలో పడటానికి సుమారు 23 నిమిషాల సమయం పడుతుందట. ఇక ఫోన్ సైలెంట్‌లో ఉంచే వారు ఈ సమయాన్ని ఆదా చేస్తారు. వారు తమ మెదడును నోటిఫికేషన్ల నియంత్రణలో కాకుండా, తమ సొంత నియంత్రణలో ఉంచుకోగలుగుతారు.
నిరంతరం వచ్చే నోటిఫికేషన్ల శబ్దాలు శరీరంలో ‘కార్టిసాల్’ అనే స్ట్రెస్ హార్మోన్ స్థాయిని పెంచుతాయి. రింగ్‌టోన్‌ను ఆఫ్ చేయడం వల్ల నాడీ వ్యవస్థ ప్రశాంతంగా మారుతుంది. దీనివల్ల హృదయ స్పందన రేటు స్థిరంగా ఉండి, అనవసరమైన ఆందోళన కలగదు. ఇక ప్రశాంతమైన మెదడుతో వీరు క్లిష్టమైన పనులను కూడా త్వరగా పూర్తి చేయగలరు.

ఫోన్ సైలెంట్‌లో ఉంచే వారు తమ సమయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి మెసేజ్‌కు లేదా కాల్‌కు వెంటనే స్పందించాలనే ఒత్తిడిని వీరు దరిచేరనీయరు. “నేను నా షెడ్యూల్ ప్రకారమే అందుబాటులో ఉంటాను” అనే బలమైన సంకేతాన్ని వీరు ఇతరులకు పంపిస్తారు.ఇక ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని, క్రమశిక్షణను పెంచుతుంది.
ఫోన్ సైలెంట్‌లో ఉంచే వారు మంచి శ్రోతలుగా గుర్తింపు పొందుతారు. ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు మాటిమాటికీ ఫోన్ చూడకుండా, సంభాషణలో పూర్తిగా నిమగ్నమవుతారు. దీనివల్ల ఇతరులతో సంబంధాలు మరింత బలంగా మారతాయి. ఇక అలాగే రాత్రిపూట వచ్చే అనవసర నోటిఫికేషన్లు ఉండవు కాబట్టి, వీరి నిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతుంది.
డిజిటల్ ప్రపంచంలో మునిగిపోకుండా, మనకంటూ కొంత ప్రశాంత సమయాన్ని కేటాయించుకోవడానికి ఫోన్ సైలెంట్ మోడ్ ఒక గొప్ప వరం. ఇది మీ బలహీనత కాదు, మీ ఏకాగ్రతను పెంచే ఒక ఆయుధం.
The post ఫోన్ సైలెంట్‌లో ఉంచేవాళ్లు… వీరి సీక్రెట్ లక్షణాలు ఇవే appeared first on Manalokam – Latest Telugu News & Updates.