Reading Time: < 1 minute
Kollywood Stars Who Have Changed Their Route Suriya Vikram Dhanush Sivakarthikeyan Are Back In The Commercial Zone

తమిళ చిత్ర పరిశ్రమలో గత కొంతకాలంగా ప్రయోగాత్మక చిత్రాల హవా నడిచింది. అయితే ఇప్పుడు అక్కడి టాప్ స్టార్స్ అందరూ రూట్ మార్చి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించే పక్కా మాస్ కమర్షియల్ జోన్‌లోకి తిరిగి అడుగుపెడుతున్నారు. ప్రయోగాలతో పాటు ప్రేక్షకులకు కావాల్సిన అసలైన వినోదాన్ని పంచడమే లక్ష్యంగా క్రేజీ ప్రాజెక్టులతో లైన్ లోకి వస్తున్నారు. ఇటీవల సూర్య నటించిన ‘కరుప్పు’ సినిమాతోనే ఈ ట్రెండ్ మొదలైంది. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రంతో సూర్య తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో నిరూపించారు. ఈ సినిమా ఏకంగారూ రూ. 320 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది.

ఇదే జోష్‌ను ఫాలో అవుతూ విక్రమ్ తన తదుపరి చిత్రం ‘చీయాన్ 63’ ను లైన్ లో పెట్టారు. ఈ సినిమా కూడా మాస్ యాక్షన్ ఎలిమెంట్స్, ఫన్ కలిపిన ఒక భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 7 నుండి ప్రారంభం కానుంది. అలాగే వైవిధ్యమైన పాత్రలు చేసే ధనుష్ సైతం తన 55వ చిత్రం ‘D55’ కోసం కమర్షియల్ రూట్ ఎంచుకున్నారు. ఇదొక స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్ అయినప్పటికీ ట్రీట్‌మెంట్ మాత్రం సాధారణ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేలా అన్ని వర్గాలకు నచ్చే కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఉండబోతోందని సమాచారం. మరోవైపు టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్ సైతం తన వింటేజ్ లుక్‌తో అలరించడానికి రెడీ అవుతున్నారు. ఆయన నటిస్తున్న ‘సేయోన్’ చిత్రం పక్కా రూరల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. గతంలో శివకార్తికేయన్‌కు భారీ బ్లాక్‌బస్టర్స్ అందించిన ‘వరుత్తపడాత వాలిబర్ సంగం’, ‘రజినీ మురుగన్’ చిత్రాల తరహాలోనే మాస్ మూమెంట్స్‌తో ఈ సినిమా ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి కోలీవుడ్ స్టార్స్ అందరూ కమర్షియల్ జోన్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తుండటంతో రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది.