Reading Time: < 1 minute
Mantralayam Tragedy Four Bodies Recovered Search Continues For One Missing In Tungabhadra River

Mantralayam Tragedy: కర్నూలు జిల్లా మంత్రాలయంలో తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు గల్లంతైన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. నదిలో మునిగిపోయిన వారిలో ఇప్పటివరకు నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన ఒకరి కోసం అధికారులు, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. గల్లంతైన వారంతా బంధువుల ఇంట్లో నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతానికి హాజరయ్యేందుకు మంత్రాలయానికి వచ్చినట్లు వచ్చారు. పూజ కార్యక్రమాలకు ముందు సరదాగా తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నదిలో నీటి లోతును సరిగా అంచనా వేయలేకపోవడంతో వారు ప్రమాదంలో చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

ఈ ఘటనలో శనివారం ధను (23) అనే యువకుడి మృతదేహం లభించగా.. ఆదివారం సతీష్ (35), యువన్ చంద్ర (5) సంధ్య (22) మృతదేహాలను కూడా గుర్తించి వెలికితీశారు. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన రాఘవేంద్ర (25) కోసం గాలింపు కొనసాగుతోంది. అయితే ఈ ఘటనలో ఆదోనికి చెందిన అపర్ణ అనే యువతి సురక్షితంగా బయటపడింది. ఆమె ఇచ్చిన వివరాల ఆధారంగా సహాయక బృందాలు గాలింపు చర్యలను మరింత వేగవంతం చేశాయి. ఈ విషాద ఘటనతో మంత్రాలయంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గల్లంతైన వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనతో ఎదురుచూస్తుండగా.. మిగిలిన ముగ్గురి కోసం అధికారులు యుద్ధప్రాతిపదికన గాలింపు కొనసాగిస్తున్నారు.