Reading Time: < 1 minute

హయత్ నగర్ లో మున్సిపల్ అధికారుల ముందే…. పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం… 

Caption of Image.

హయత్ నగర్ లో ఓ వ్యక్తి మున్సిపల్ అధికారుల ముందే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంటిపక్కనే వ్యక్తి అక్రమంగా నిర్మాణం చేస్తుండగా ఫిర్యాదు చేసినా.. అధికారులు పట్టించుకోవట్లేదంటూ ఆరోపిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు బాధితుడు. శనివారం ( జూన్ 6 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

హయత్ నగర్ పద్మావతి కాలనీ లో శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఇంటిపక్కన వ్యక్తి అక్రమంగా నిర్మాణం చేస్తుండగా పిర్యాదు చేస్తే అధికారులు0 పట్టించుకోలేదని ఆరోపిస్తున్నాడు బాధితుడు. అధికారులకు ఫిర్యాదు చేసినందుకు పక్కింటి వ్యక్తి నగేష్ తనపై దాడికి దిగాడని వాపోయాడు బాధితుడు.

►ALSO READ | నిజామాబాద్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో వేధింపుల కలకలం

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.  బాధితుడు ఆత్మహత్యాయత్నం చేయడంతో వెంటనే అక్రమ నిర్మాణానికి నోటీసులిచ్చారు మున్సిపల్ అధికారులు.

©️ VIL Media Pvt Ltd.