Reading Time: < 1 minute

జనసేన రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా లింగమనేని రమేష్.. పవన్ ఇతనికే ఛాన్స్ ఎందుకిచ్చారంటే..

Caption of Image.

అమరావతి: రాజ్యసభ అభ్యర్థి విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును.. పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేన పార్టీతో, పవన్ కల్యాణ్తో 2015 నుంచి రమేష్కు అనుబంధం ఉందని జనసేన పార్టీ పేర్కొంది. శనివారం మధ్యాహ్నం రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేస్తారని జనసేన పార్టీ తెలిపింది.

2019 ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినా.. జనసేన సిద్ధాంతాల పైనా, పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పైన విశ్వాసం కనబరిచి.. ఎన్ని ఒత్తిళ్లు, సవాళ్లు ఎదురైనా సహనంతో నిలిచిన వారికి నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇచ్చారని జనసేన తెలిపింది. ఇదే సూత్రాన్ని రాజ్యసభ అభ్యర్థి ఎంపికలోనూ పవన్ కల్యాణ్ పరిగణనలోకి తీసుకున్నారని జనసేన విడుదల చేసిన ప్రకటనతో పేర్కొంది.

ఆంధ్ర ప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి స్థానాల కేటాయింపుపై ఎన్డీయే సమన్వయ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నాలుగు స్థానాలు టీడీపీకి, ఒక స్థానం జనసేనకు కేటాయించారు.

©️ VIL Media Pvt Ltd.