Reading Time: < 1 minute

ఏపీలో ఘోర ప్రమాదం: ఘాట్‌ రోడ్డులో మినీ టెంపో బోల్తా.. 17 మందికి గాయాలు

Caption of Image.

ఏపీలోని పోలవరం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డులో ప్రైవేట్ ట్రావెల్స్ కి చెందిన మినీ టెంపో బోల్తా పడటంతో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం ( జూన్ 5 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. పోలవరం జిల్లా చింతూరు–మారేడుమిల్లి ఘాట్‌ రోడ్డులో జరిగింది ఈ ఘటన. ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన మినీ టెంపో అదుపుతప్పి బోల్తాపడిటంతో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు పోలీసులు.ఈ ఘటనలో 17 మంది గాయపడగా.. వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మినీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నట్లు తెలిపారు పోలీసులు. 

©️ VIL Media Pvt Ltd.