Reading Time: < 1 minute

32 ఏళ్లకే టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన కేఎస్ భరత్…

Caption of Image.

ఇండియన్ వికెట్ కీపర్ కేఎస్ భరత్ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గత కొంత కాలంగా టీంలో స్థానం దక్కకపోవడంతో కేఎస్ భరత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 32 ఏళ్ల వయసులో కేవలం 7 మ్యాచ్ లే ఆడి టెస్ట్ కెరీర్ కి గుడ్ బై చెప్పిన ఈ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇకపై విదేశీ టీ20 లీగ్స్ పై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

2023 నుండి 2024 వరకు తరపున ఏడు టెస్టులు ఆడిన ఆంధ్ర క్రికెటర్, ఇటీవల విదేశీ లీగ్స్ ఆడుతున్న ప్లేయర్ల లిస్ట్ లో చేరాడు. ఈ జాబితాలో తమిళనాడు ఆల్-రౌండర్ విజయ్ శంకర్ కూడా ఉన్నారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం, భారత క్రికెట్‌తో అధికారికంగా సంబంధాలు తెంచుకుంటే తప్ప, యాక్టీవ్ ప్లేయర్స్ విదేశీ ఫ్రాంచైజీ లీగ్‌లలో పాల్గొనడానికి అనుమతి లేదు.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by K S Bharat (@konasbharat)

కేఎస్ భరత్ దేశీయ క్రికెట్‌ లో ఆంధ్రా తరఫున 6 వేల పరుగులు పైగా సాధించాడు, ఈ ఏడాది ఆరంభంలో జరిగిన రంజీ ట్రోఫీలో కూడా  ఆడాడు కేఎస్ భరత్. రిషబ్ పంత్ యాక్సిడెంట్ కి గురైన తర్వాత అతనికి ఇండియన్ టీంలో అవకాశం లభించింది, ఫిబ్రవరి 2023లో ఆస్ట్రేలియాపై తన టెస్ట్ అరంగేట్రం చేశాడు భరత్.

ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్:

నా స్కిల్ ను గుర్తించి, అవకాశం కల్పించిన నా ఐపీఎల్ డెబ్యూ మ్యాచ్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి, టెస్ట్ డెబ్యూ కెప్టెన్ రోహిత్ శర్మకు థ్యాంక్స్ అంటూ ఇన్స్టాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు కేఎస్ భరత్. గర్వంగా, కృతజ్ఞతా భావంతో అంతర్జాతీయ క్రికెట్ నుండి నేను రిటైర్ అవుతున్నట్లు ప్రకటిస్తున్నానంటూ పోస్ట్ చేశాడు భరత్. 
 

©️ VIL Media Pvt Ltd.