Reading Time: < 1 minute

అమరుల స్మారక స్తూపాలు ఏర్పాటు చేయాలి.. పరేడ్ గ్రౌండ్ సమీపంలో అమరవీరుల కుటుంబాల ధర్నా

Caption of Image.

పద్మారావునగర్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల స్మారక స్తూపాలను ట్యాంక్‌‌‌‌బండ్‌‌‌‌పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు మంగళవారం నిరసన చేపట్టారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సమీపంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. మహబూబ్‌‌‌‌నగర్, సిద్దిపేట్, దమ్మాయిగూడ, జియాగూడ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన అమరవీరుల కుటుంబ సభ్యులు తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. ధర్నా కారణంగా కొంతసేపు ట్రాఫిక్‌‌‌‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీసు వాహనాల్లో తరలించారు. 

©️ VIL Media Pvt Ltd.