Reading Time: < 1 minute

CBSE కొత్త చైర్మన్ గా లోఖండే ప్రశాంత్ సీతారామ్.. కొత్త కార్యదర్శిగా వరుణ్ భరద్వాజ్

Caption of Image.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) వివాదంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. సీబీఎస్ఈ కొత్త చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి లోఖండే ప్రశాంత్ సీతారామ్‌ను, కొత్త కార్యదర్శిగా ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి వరుణ్ భరద్వాజ్‌ను నియమించింది. ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ప్రస్తుత చైర్మన్ రాహుల్ సింగ్, కార్యదర్శి హిమాన్షు గుప్తాలను బదిలీ చేసిన కొద్ది గంటల్లోనే ఈ నియామకాలు జరిగాయి.

ప్రస్తుతం హోం శాఖలో  అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న లోఖండే ప్రశాంత్ సీతారామ్ 2001 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. వరుణ్ భరద్వాజ్ ప్రస్తుతం విద్యా మంత్రిత్వ శాఖలో డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు.  ఇదిలా ఉండగా, ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) సేవల సేకరణపై విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం, క్యాపబిలిటీ బిల్డింగ్కమిషన్ చైర్‌పర్సన్ ఎస్ రాధా చౌహాన్ నేతృత్వంలో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. నెలరోజుల్లో రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. 

ఇటీవల CBSE 12వ తరగతి విద్యార్థులు తమ జవాబు పత్రాల స్కాన్ కాపీలు అసలు చేతిరాతతో సరిపోలడంలేదని ఆరోపించడంతో  OSM  సిస్టమ్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెక్నికల్ లోపాలు,  పేమెంట్ సమస్యలు, రీవెరిఫికేషన్, రీవాల్యుయేషన్ లో జాప్యంపై పేరెంట్స్, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో CBSE సిస్టమ్ లో  పారదర్శకత, జవాబుదారీతనం అవసరమన్న డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి.

©️ VIL Media Pvt Ltd.