Reading Time: < 1 minute

రణమా.. మరణమా..? తృణమూల్ అధినేత్రి నినాదం.. ఎన్నికల అనంతర హింసపై దీదీ భారీ ధర్నా

Caption of Image.

2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి పోరు బాటను ఎంచుకున్నారు. ఎన్నికల అనంతరం కొలువు దీరిన బీజేపీ ప్రభుత్వంలో తమ పార్టీ నాయకులను, కార్యకర్తలను టార్గెట్ చేసి హింసకు పాల్పడినట్లు ఆమె ఆరోపిస్తున్నారు. కార్యకర్తలను ఒంటరిగా వదిలిపెట్టను.. ప్రాణం ఉన్నంత వరకు వారి కోసం పోరాడతానని మంగళవారం (జూన్ 02) కోల్ కతాలో భారీ ధర్నా చేపట్టారు. 

ఈ సందర్భంగా రణమా.. మరణమా..? అంటూ భారీ నినాదాలు ఇచ్చారు. ధర్నా చేస్తామంటే పర్మిషన్ ఇవ్వలేదు.. మైక్రోఫోన్స్ కూడా అనుమతించడంలేదు ఇక్కడి బీజేపీ ప్రభుత్వం అని విమర్శించారు. 

ఎన్నికల అనంతరం టీఎంసీ కార్యకర్తలతో పాటు ఎంపీ అభిషేక్ బెనర్జీపై చేసిన దాడికి నిరసనగా కోల్ కతాలో చేపట్టిన ధర్నాలో తీవ్ర విమర్శలకు దిగారు దీదీ. రాని రష్మోనీ రోడ్డులో చేపట్టిన ఈ ధర్నాకు భారీగా జనసమీకరణ చేశారు. 

బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం మునపటిలా లేదని.. ప్రజలు భయంతో, ఆందోళనతో ఉంటున్నారని మమత ఆరోపించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం నాయకులు పార్టీ (TMC)ని వీడితే.. అది సంస్థ పునర్నిర్మాణానికి సాయపడుతుందన్నారు. దీనినుంచి టీఎంసీ మరింత బలంగా పుంజుకుంటుందన్నారు.

 పోలీసుల అనుమతి లేకపోయినా ధర్నా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అరెస్టు అయ్యేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. పోలీసులు ఒక రాజకీయ పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ నిరసన తెలిపేందుకు తనకు అనుమతి ఇవ్వకపోతే.. దిల్లీకి వెళ్తానని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాదాపు 12 మంది టీఎంసీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని.. వేలాది మంది పార్టీ కార్యకర్తలు అరెస్టయ్యారని మమత తెలిపారు. 

చీలిక దిశగా తృణమూల్ పార్టీ పరిస్థితి మారిందనే ఊహాగానల మధ్య.. దీదీ చేపట్టిన ధర్నాకు కేవలం 5 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే హాజరు కావడం గమనార్హం.చీలిక దిశగా తృణమూల్ పార్టీ పరిస్థితి మారిందనే ఊహాగానల మధ్య.. దీదీ చేపట్టిన ధర్నాకు కేవలం 5 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే హాజరు కావడం గమనార్హం.

©️ VIL Media Pvt Ltd.