Reading Time: < 1 minute
Mamata Banerjee Dharna Kolkata Warning To Bjp Abhishek Attack

Mamata Banerjee: మేనల్లుడు, డైమండ్ హర్బర్ ఎంపీ అయిన అభిషేక్ బెనర్జీ, మరో ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై దాడి ఘటనలపై తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో అధికార బీజేపీని టార్గెట్ చేస్తూ హెచ్చరికలు చేశారు. ‘‘ మమ్మల్ని గద్దె దించే వరకు నేను చావను’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారిగా ఆమె బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘మేము పోరాడుతాము లేదా చస్తాము’’ అని అన్నారు.

గతం తాను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, టీఎంసీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ అధ్యక్షుడు సాయం కోరుతూ తనకు ఫోన్ చేశారని కానీ, ఈ విషయం మీడియాతో ఎప్పుడూ చెప్పలేదని మమతా బెనర్జీ అన్నారు. బీజేపీ తప్పా మిగతా పార్టీలతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. బీజేపీ సాయం అడిగినప్పుడల్లా తాను సాయం చేశానని, వారి కష్టకాలంలో అండగా నిలిచానని వెల్లడించారు. ‘‘నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఉంటాను. నేను బతికి ఉన్నంత కాలం ధైర్యంగా పోరాడుతాను’’ అని అన్నారు.

కోల్‌కతాలోని వై ఛానెల్‌లో మమతా బెనర్జీ ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి గైర్హాజరైన ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ.. మనకు నమ్మక ద్రోహం చేసిన వారిని ఈశ్వర్ అల్లా, దేవుడి పేరు మీద బుద్ధి ప్రసాదించాలని అన్నారు. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై దాడి గురించి మాట్లాడుతూ.. ఆ రోజు అతను చనిపోయే వాడని అన్నారు. సీఎం సువేందు అధికారిపై విమర్శలు చేస్తూ.. ప్రభుత్వం బీజేపీలో పాతతరం వారికి అధికారం లేదని, కొత్తగా వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి అధికారం ఉందని అన్నారు.