Reading Time: < 1 minute

తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో..ఎంపీ వంశీకృష్ణ

Caption of Image.

 తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాల్లో మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎంపీలు ,అధికారులు వేడుకుల్లో పాల్గొన్నారు.. మంచిర్యాలలో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు.   బై పాస్ రోడ్డులోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టరేట్ లో  పోలీసులు గౌరవందనం స్వీకరించి జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు.  తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు ఎంపీ వంశీకృష్ణ

మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ లో  తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా కార్మిక శాఖ మంత్రి  వివేక్ వెంకట్ స్వామి  అమర వీరుల స్తూపం దగ్గర నివాళులర్పించారు. అనంతరం జెండా ఆవిష్కరించారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థులు అమరవీరుల గుర్తు చేసుకుంటూ ప్రదదర్శించిన కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. 

©️ VIL Media Pvt Ltd.