Reading Time: < 1 minute

ఊపందుకున్న అమీన్‌‌‌‌పూర్, బీహెచ్‌‌‌‌ఈఎల్ ఫ్లైఓవర్ పనులు..

Caption of Image.
  •     మెదక్​ ఎంపీ రఘునందన్‌‌‌‌రావు

చందానగర్/రామచంద్రాపురం,వెలుగు : బీహెచ్‌‌‌‌ఈఎల్ చౌరస్తా నుంచి అమీన్‌‌‌‌పూర్ బంధంకొమ్ము వరకు నేషనల్ హైవేను అనుసంధానించే ఫ్లైఓవర్, నాలుగు లైన్ల రహదారి నిర్మాణ పనులు త్వరలో పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్నాయని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. సోమవారం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్​తో కలిసి రఘునందన్‌‌‌‌రావు బీహెచ్‌‌‌‌ఈఎల్ ప్రాంతంలో జరుగుతున్న పనులను పరిశీలించారు.

 అనంతరం మాట్లాడుతూ.. బీహెచ్‌‌‌‌ఈఎల్ చౌరస్తా నుంచి అమీన్‌‌‌‌పూర్ బంధంకొమ్ము వరకు నాలాపై ఫ్లైఓవర్ నిర్మాణం, నాలుగు లైన్ల రహదారి పూర్తయితే శేరిలింగంపల్లి, అమీన్‌‌‌‌పూర్ ప్రాంత ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరుతుందన్నారు. వారం రోజులుగా నాలా డైవర్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ రహదారి నిర్మాణం బీజేపీ ఎంపీల నిరంతర కృషి అని చెప్పారు. కార్యక్రమంలో గోదావరిరెడ్డి, మహిపాల్ రెడ్డి, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.