
ఘాట్ రోడ్డు మూసివేయడంతో.. శ్రీకనకదుర్గ నగర్ వైపు నుంచి ప్రత్యామ్నాయ రాకపోకలు ప్రారంభమయ్యాయి. భక్తుల కోసం సీతమ్మవారి పాదాలు, కుమ్మరిపాలెం సెంటర్, పున్నమి ఘాట్ ప్రాంతాల నుంచి నిరంతరాయంగా ఉచిత దేవస్థానం బస్సులను నడుపుతున్నారు. మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. భక్తుల సౌకర్యార్థం ఘాట్ రోడ్డులో ఉన్న ప్రొటోకాల్ ఆఫీస్‌ను కొండ దిగువన శ్రీకనకదుర్గ నగర్‌లో కొత్తగా నిర్మించిన భవనంలోకి మార్చారు. ఉచిత బ్యాటరీ వాహనాలను, టికెట్ కౌంటర్ సిబ్బందిని కూడా ఇక్కడికే తరలించారు.ప్రొటోకాల్ పరిధిలోకి వచ్చే భక్తుల దర్శనాల కోసం మహామండపం దగ్గర ప్రత్యేక క్యూలైన్లు సిద్ధం చేశారు. అలాగే నిత్యపూజలు, సేవలకు వచ్చే భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో తగినన్ని బ్యాటరీ వాహనాలను అందుబాటులో ఉంచారు. ఘాట్ రోడ్డు మూసివేత, ప్రత్యామ్నాయ మార్గాల గురించిన సమాచారాన్ని భక్తులకు తెలియజేయడానికి ఆలయ ప్రాంగణంలో మైకుల ద్వారా నిరంతరం అనౌన్స్‌మెంట్స్ చేస్తున్నారు. కాబట్టి ఇంద్రకీలాద్రికి వచ్చే ప్రయాణికులు, భక్తులు ఈ మార్పులను గమనించి అధికారులకు సహకరించాల్సిందిగా కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
పెద్ది స్టోరీ.. చరణ్ చెప్పిన కథలాంటిదేనా?
సనాతనధర్మం అంటే మతం కాదు..జీవన విధానం
బాబాయ్ నుంచి అబ్బాయికి తియ్యటి కబురు!
‘పెద్ది’ సినిమాకు అన్నీ శుభ శకునాలే.. రెచ్చిపోవడమే తరువాయి..