
సంక్రాంతి పండుగ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్ల వద్ద సందడి తగ్గింది. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో, మంచి కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ఆదరిస్తారని కొన్ని చిత్రాలు నిరూపించాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం విడుదల కాబోతుంది. డిస్ట్రిబ్యూటర్లు ,ఎగ్జిబిటర్లు ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ది చిత్రానికి టికెట్ ధరల పెంపుతో పాటు స్పెషల్ షోలకు అనుమతినిచ్చింది. జూన్ 3 రాత్రి 8 గంటల తర్వాత ప్రీమియర్ షోలను ప్రదర్శించుకోవచ్చు. ఏపీలో ప్రీమియర్ షో టికెట్ ధర జీఎస్టీతో కలిపి గరిష్టంగా 600 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే జూన్ 4 నుండి 10 రోజుల పాటు రోజుకు ఐదు షోలకు అనుమతి లభించింది.
మరిన్ని వీడియోల కోసం :
పెద్ది స్టోరీ.. చరణ్ చెప్పిన కథలాంటిదేనా?