Reading Time: < 1 minute

ఢిల్లీలో ఘోర ప్రమాదం: భారీ వర్షాలకు కుప్పకూలిన ఐదంస్తుల భవనం

Caption of Image.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణ ఢిల్లీలోని సాకేత్‌ ప్రాంతంలో శనివారం (మే 31) రాత్రి ఐదంస్తుల భవనం కుప్పకూలింది. ప్రమాదానికి గురైన భవనం మెహ్రౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సకెర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న సైదులాజాబ్ ప్రాంతంలో ఉంది. దేశ రాజధానిలో శనివారం కురిసిన భారీ వర్షం, ఈదురు గాలులు, ఉరుముల ప్రభావంతో భవనం కూలింది.

కుప్పకూలిన భవనంలో పలువురు  చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, సహయక బృందాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని రెస్య్కూ ఆపరేషన్ చేపట్టాయి. ఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య భారీగానే ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. 

►ALSO READ | దేశ ధాన్య నిల్వలు రెండు సంస్థల చేతుల్లోనా?.. FCI సైలో ప్రాజెక్ట్ కాంట్రాక్టులపై దేశవ్యాప్తంగా చర్చ

©️ VIL Media Pvt Ltd.