
రామ్ చరణ్, మోస్ట్ అవేటెడ్ ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ‘పెద్ది’ టీమ్ సోమవారం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ‘పెద్ది’ చిత్రయూనిట్‌తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. రామ్ చరణ్, జాన్వీకపూర్ నటించిన ‘పెద్ది’ మూవీ.. జూన్ 4న విడుదల కానుంది. అయితే.. విజయవాడలో మోత మోగిపోయేలా పెద్ది ఈవెంట్ నిర్వహిస్తున్నారు. దీనిలో ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్ ఉండబోతోంది.. ఇప్పటికే ట్రైలర్‌తో పెద్ది మేనియా ఇండియా మొత్తం విస్తరించింది. ఇప్పుడా జోష్‌ను మరో లెవల్ కు తీసుకెళ్లేందుకు మూవీ టీమ్ ఈ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది.
బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమా కోసం.. మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.